![]() |
![]() |
.webp)
బుల్లితెర మీద ఫైమా అంటే తెలియని వాళ్ళు లేరు. లేడీస్ లో కామెడీ టైమింగ్ ఉన్నవారిలో రోహిణి, ఫైమా వీరే ఉన్నారు ఇప్పుడు. అలాంటిది ఫైమా తన జీవితంలో చాల కష్టాలు, మాటలు పడింది. ఆ విషయాన్నీ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. "నాకు కొంచెం పేరు వచ్చేసరికి కొంతమంది అసలు ఈమేంటి ఇలా ఉంది ? ఏముంది ఈమె దగ్గర ? అంటూ కామెంట్స్ చేశారు. నేను భరించలేక మా అమ్మకి కాల్ చేసి ఎందుకు ఇంత నల్లగా కన్నావు అని అడిగా మా అమ్మ ఘోరంగా ఏడ్చింది.
ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు అనేది నీ లైఫ్ లో ఏమన్నా ఉందా..మా ఇంటి పరిస్థితి బాలేదు. అప్పుడు నేను పక్కన వలలు కొత్త డ్రెస్ వేసుకున్నా నేను ఏడ్చేసేదాన్ని. " "ఏదన్న రూమర్ స్ప్రెడ్ చేయాలంటే ఎం చేస్తావ్ " అని అడిగింది. "నరేష్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయి ఫైమా " అనే రూమర్ స్ప్రెడ్ చేస్తా అంది. "పెద్దోళ్ళను చంపేస్తున్నారు చిన్నపిల్లలను మరీ దారుణంగా చేస్తున్నారు. నీకు ఒక పవర్ ఉంటె వాళ్లకు ఎలాంటి శిక్ష వేస్తావ్ " అంది. "వాళ్లకు గడ్డి మందు ఇస్తాను. చచ్చిపోతున్నప్పుడు వాళ్లకు కూడా బాధ అనేది తెలియాలి " అంది ఫైమా. "ఆడపిల్లగా పుట్టినందుకు హ్యాపీగా ఉన్నావా " అంది. "అస్సలు హ్యాపీగా లేను. మళ్ళీ వచ్చే జన్మలో మగాడిగా పుట్టాలి.
అనుకున్నంత ఈజీ కాదు ఆడపిల్ల బతుకు. "డబ్బులు మన దగ్గర లేనప్పుడు ఆ ప్రేమ అనేది ఉండదు. ఒక్కసారి మన దగ్గర డబ్బు రావడం మొదలైతే మన పేరు వినిస్తది కానీ మన బాధ ఎవరికీ కనిపించదు. బయట నుంచే కాదు ఇంట్లో నుంచి నేను చాల సమస్యలు ఎదుర్కున్న. ఎప్పుడూ నేను మా నాన్న గొప్ప స్థాయిలో ఉండాలని ఆలోచించేదాన్ని. కానీ ఇప్పుడు నేను కష్టపడుతుంటే విచ్చలవిడిగా అసలు. నేను బయట తిరగను. వేలకు వేలు డ్రెస్సులు కూడా వేయను. మరి నా డబ్బులు ఎటు పోతున్నట్టు . అసలు నేను ఎవరి కోసం కష్టపడుతున్నా అన్న ఆలోచన వచ్చేసింది. దేవుడు కనిపిస్తే గతంలో మేమంతా ఎలా ఉన్నామో అలా ఆ పరిస్థితి మొత్తాన్ని మా నాన్నకు గుర్తు చేస్తే బాగుండు " అంది ఫైమా .
![]() |
![]() |